Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామానికి చెందిన బత్తయ్య "43 సం"వ్యక్తి.. "ఈసుళ్ళు" వేట కోసం వెళ్లాగా దారిలో రైతు తన పొలంలో అడవి పందుల నుండి రక్షించుకోవడానికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరికి చెప్పకుండా కరెంటు తన పొలం చుట్టు పెట్టుకున్నాడు.. కరెంటు లాగిన విషయం బత్తయ్యకు తెలియకపోవడంతో పోయి కరెంట్ లో చిక్కుకున్నాడు.. చనిపోయిన బత్తయ్య ను రైతు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి ఏమీ తెలియనట్టు గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వచ్చేసాడు.. రెండు రోజులైనా కనబడని బత్తయ్యను గ్రామంలో అందరూ చెట్టు పుట్ట అంత గాలించడంతో మంచి పొదల్లో పడి ఉన్న బత్తయ్య మృత దేహం చూసి లబోదిబోమన్నారు. వెంటనే ఏర్పేడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు.. దీనిపై పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియవచ్చు.
Admin
Famous TV