Famous TV - క్రైమ్ వార్తలు / హైదరాబాద్ : సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతున్న మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బ్యాగులో 10 తులాల బంగారం, రూ.10 లక్షల విలువైన రెండు వజ్రాలు ఉన్నట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు.
Admin
Famous TV