Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : పలమనేరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి నందు గుప్త నిధుల తవ్వకాలపై ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. నిన్న (11-10-25) రాత్రి పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లె గ్రామ పరిసరాల్లో అక్రమంగా గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు: కెళవతి గ్రామానికి చెందిన యెర్రబల్లి శ్రీనివాసులు (పూర్వ MPTC, ప్రస్తుతం వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి) తన తమ్ముడు సరవణతో కలిసి నిధి వేటకు కుట్ర పన్నారు. పుంగనూరుకు చెందిన పూజారి అంబిక స్వామి సూచనలతో వీరప్పల్లె సమీపంలో పూజలు నిర్వహించి తవ్వక స్థలాన్ని గుర్తించారు. తర్వాత మాజీ పోలీస్ సిబ్బంది వినోద్ కుమార్ (మాజీ ARHC-157, DAR చిత్తూరు) ను సంప్రదించి జేసీబీ, మెటల్ స్కానర్, మరియు మరికొందరితో కలిసి అక్టోబర్ 11వ తేదీ రాత్రి తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలపై వచ్చిన సమాచారం మేరకు పలమనేరు అర్బన్ ఇన్స్పెక్టర్ మురళీ మోహన్,రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు ఆదేశాలపై పలమనేరు అర్బన్ ఎస్ఐ లోకేష్, మరియు పంజాని పోలీస్ స్టేషన్ పీఎస్ఐ మారెప్ప నేతృత్వంలో దాడి చేసి, ఏడుగురిని అదుపులోకి తీసుకుని జేసీబీ యంత్రం, కారు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముద్దాయి వివరాలు: వై. శ్రీనివాసులు, వయసు 50 సంవత్సరాలు, తండ్రి పేరు: కృష్ణప్ప, గ్రామం: కెళవతి, మండలం: పెద్దపంజాణి.వై. సరవణ, వయసు 43 సంవత్సరాలు, తండ్రి పేరు: కృష్ణప్ప, వృత్తి: ఎయిర్ కంప్రెషన్ టెక్నీషియన్, నివాసం: చెన్నై.బి.శ్రీనివాసులు, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు: లక్ష్మయ్య, గ్రామం: బండ్లపల్లి, మండలం: పుంగనూరు,బి.ప్రకాశ్, వయసు 47 సంవత్సరాలు, తండ్రి పేరు: లక్ష్మయ్య, జాతి: గ్రామం: బండ్లపల్లి, మండలం: పుంగనూరు, సి.శ్రీనివాసరెడ్డి, వయసు 34 సంవత్సరాలు, తండ్రి పేరు: సుబ్బారెడ్డి, గ్రామం: బండపల్లి, మండలం: పుంగనూరు.కాణిపాకం రమేష్, వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు: పి. త్యాగరాజులు, గ్రామం: సిద్దంపల్లి, మండలం: తవనంపల్లి. వృత్తి: వెల్డింగ్ పని, జె. సునీల్, వయసు 33 సంవత్సరాలు, తండ్రి పేరు: జె. సత్య, వృత్తి: జేసీబీ డ్రైవర్, గ్రామం: బండకిందపల్లి, మండలం: కలికిరి. తప్పించుకున్నవారు శ్రీనివాసులు - ఎ.కొత్తకోట, మండలం:చౌడేపల్లి.వినోద్ కుమార్,గ్రామం: చౌడేపల్లి.చిత్తూరు వెంకటేష్, కట్టిమంచి, వృత్తి: ఎలక్ట్రిషియన్. సంతోష్ రెడ్డి(జేసీబీ యజమాని) మరియు అతని స్నేహితుడు,చిత్తూరుకు చెందిన ఇద్దరు స్వామీజీలు (తప్పించుకున్నారు)
Admin
Famous TV