Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలో పనిచేసిన విఆర్ఓ ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ వసూలు చేసి పారిపోయిన వైనం, ప్రస్తుతము చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చలమంగళం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఈశ్వరయ్య, గతం లో చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామ పంచాయతీ విఆర్ ఓ గా విధులు నిర్వహిస్తూ ప్రజల వద్ద ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ లో ఇంటి పట్టాలు ఇస్తామని ముగ్గురు మహిళలను నమ్మించి వారి వద్ద నుండి సుమారు మూడులక్షలు వసూలు చేశాడని వారు వాపోయారు.అంతే కాకుండా చాలా మంది దగ్గర పట్టా మార్పిడి చేస్తామని, పాసుపుస్తకాలు చేయిస్తామని,వన్ బి చేయిస్తామని లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం పైన ఎన్నోసార్లు పెద్దపంజాణి మండలం తాహాశిల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళి మహిళలు అతన్ని అడుగగా,అన్నీ అయిపోయాయి, ఇక తాహాశిల్దార్ సంతకాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయంటూ నమ్మబలికి గతం లో ప్రస్తుత పెద్దపంజాణి లో పనిచేస్తున్నటువంటి తాహాశిల్దార్ గతం లో చౌడేపల్లిలో పనిచేశారు. కాబట్టి అతని వద్ద సంతకాలు చేయిస్తానని మళ్ళీ డబ్బులు వసూలు చేశాడు.ఇతని బాదితులు చౌడేపల్లి మండలం లో సుమారు ఇరవై నుండి ముప్పై మందికి పైనే ఉన్నారు.ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్దామంటే ఈ రోజు అయిపోయింది,అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.ప్రస్తుతం గట్టిగా అడుగ్గా నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారని బాదితులు తెలియజేశారు. ఇటువంటి గ్రామ రెవిన్యూ అధికారి వలన రెవిన్యూ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, వెంటనే సదలు విఆర్ఓ ఈశ్వరయ్యను విధుల నుండి శాశ్వతంగా తొలగించి, బాదితుల వద్ద తీసుకున్న డబ్బులు అతని పియఫ్ నుండి జమ చేయాలని వారు కోరడమైనది.
Admin
Famous TV