Sunday, 26 July 2026 04:10:11 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్

Date : 03 February 2026 06:18 PM Views : 848

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : పిజిఆర్ఎస్ లో కలెక్టర్ కు పిర్యాదు అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని గోసల కురప్పల్లి ప్రాథమిక పాఠశాలలో అంధ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న కోలా గౌతమ్ బిసి ఎ దాసరి కులానికి చెందినవాడు,ఐతే అతను తను ఎస్సి మాల అని ఫేక్ సర్టిఫికెట్ తో విజువల్ హ్యాడీక్యాప్ తో ఉపాధ్యాయ ఉద్యోగము సంపాధించాడు. ఇదిలా ఉండగా ఈ మద్యకాలంలో అతను, అతని భార్య శిల్పా, అతను తల్లి కోలా కుమారమ్మలు మండలంలోని దిగువపల్లి గ్రామపంచాయతీ,యానిదిపాళ్యం నుండి చిన్నపిల్లల్ని నలబై వేలకు కొనుగోలు చేసి, సదరు పిల్లల్ని విశాఖపట్నం లో నాలుగులక్షలకు అమ్మినట్లు తెలిసి అప్పట్లో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.అప్పుడు ఐసిడియస్ వారు సదరు వీళ్ళు అమ్మిన చిన్నపిల్లను పోలీసుల ద్వారా శిశువిహార్ కు తరలించారు.ఈ విషయం పైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణాలు తెలియడం లేదు. ఈ చిన్నపిల్లల అమ్మకాల విషయం పై మా ప్రతినిధి చేసిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా కోలా గౌతమ్ అనే అంధ ఉపాధ్యాయుడు ఎస్సి సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగము పొందినట్లు ఆధారాలు బయటపడటంతో ఈ విషయం పైన మంగళవారం సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు.ఈ పిర్యాదులో భాగంగా కోలా గౌతమ్ ను శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని, దీని పైన ఎస్సి కులసంఘ నాయకులు పోరాటం చేయాలని, ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్ గాళ్ళ వల్ల సమాజంలో మనవాళ్ళకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని, కావున ఈ ఉద్యమం మండల స్థాయి నుండి జాతీయ స్థాయికి విస్తరింపచేయాలని ఆయన అన్నారు. కావున అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే అతనిని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించి, అతని పై ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఇంకెవరైనా తప్పుడు కుల దృవీకరణ పత్రాలు తీసుకోవాలంటే ఇటువంటి శాస్తి కలుగుతుందని హెచ్చరిక జారీ చేయాలన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: