Monday, 27 July 2026 07:51:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అనాధ శరణాలయ నిర్వాహకుడి దాష్టీకం

Date : 19 December 2025 07:19 AM Views : 518

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చిత్తూరు ఫేమస్ టీవి: ఆనాధ పిల్లలే కదా అడిగేవారెవరులే అనుకొన్నాడా నిర్వాహకుడు... అన్యం పుణ్యం తెలియని అరచెయ్యిని పగులగొట్టేశాడు... ఇంకేమి చేస్తాడో అన్న భయంతో వేసుకొన్న నిక్కరుతోనే సొంత గ్రామానికి చేరుకున్నాడా బాలుడు...బాలుడి కథనం మేరకు...చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పంచాయతీ కేంద్రం పుదిపట్లలో సంజోత్ అనే ఆశ్రమాన్ని నిరంజన్రెడ్డి అనే అతను నడుపుతున్నాడు.కుటుంబంలోని తల్లిదండ్రులు, ఎవరో ఒకరిని కోల్పోయిన వ్యక్తుల పిల్లలు, చదువుకొనే స్థోమత లేని పిల్లలు ఈ ఆశ్రమంలోకి చేరదీస్తున్నారు.ఈక్రమంలో చిత్తూరు సంతపేటకు చెందిన ప్రకాష్ కుమారుడు ఆదిత్య(13) ఇదే ఆశ్రమంలో వున్నాడు. ఇక్కడే వుంటూ వుదిపట్ల ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత రెండు రోజులుగా బాలుడు పాఠశాలకు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఆరా తీసింది. నిర్వాహకుడు నిరంజన్రెడ్డిని మా ప్రతినిధి చరవాణిలో విచారించే ప్రయత్నం చేయగా అతని నుంచి దురుసుగా సమాధానం రావడంతో జరిగిన ఉదంతం బయటకు వచ్చింది.ఆశ్రమంలో ఆనాధ పిల్లలచేత పశువులు, కోళ్ళను మేపించడం,వాటి వ్యర్థ పదార్థాలను ఊడిపించడం వంటి కార్యక్రమాలను చేయిస్తున్నాడనీ,పిల్లలు ఒప్పుకోకుంటే దారుణంగా బాదుతున్నాడని ఆదిత్య సామాజిక మాద్యమం ద్వారా వివరించాడు.తనను కోళ్ళవ్యర్థ పదార్థాలు తీయలేదని చితకొట్టాడనీ, చెయ్యి అడ్డు పెడితే పగిలేలా ఇనుప ఊచతో కొట్టగా భరించలేక పారిపోయి వచ్చేశానని మాద్యమంలో తెలిపాడు.తాను వేసుకొన్ని నిక్కరుతోనే సొంత గ్రామానికి చేరుకొన్నానని తెలిపాడు. తనతోపాటు అక్కడున్న పిల్లలకు ఇదే పరిస్థితి వుందనీ, వారందరినీ ఆదుకోవాలని వాట్సాఫ్ ద్వారా సమాచారాన్ని వ్యక్త పరచాడు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఈ విషయం తెలిసిన ఐసిడియస్,సిడబ్యూసి అధికారులు విచారణ చేపట్టారు.ఈ విషయం పైన బాదితుడి తల్లి సుదా ఇచ్చిన పిర్యాదు పైన చౌడేపల్లి పోలీసులు కేసు నమోదుచేసినట్లు ఎస్సై నాగేశ్వరావు తెలిపారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :