Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : కత్తితో పొడిచి పరారీలో ప్రియుడు చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం పంచాయతీ, దాసరి కాలనీ లో వివాహేతర సంబంధం ఇక వద్దన్నందుకు మహిళను కత్తితో పొడిచిన ప్రియుడు. వెదురు కుప్పం మండలం పచ్చికాపలం గ్రామం దాసరి కాలనీకి చెందిన గీత 28 సం" రేణిగుంట కు చెందిన చంటి 35 సం" తో గత 10 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం. గీత మొదటి భర్తకు కలిగిన ఇద్దరు పిల్లలతో దాసరి కాలనీలో జీవనం. 16 సంవత్సరాలు కలిగిన పిల్లల ముందర వివాహేతర సంబంధం ఇక వద్దన్న గీత. పెళ్లి కూడా చేసుకోకుండా తనను నమ్ముకుని రేణిగుంట నుంచి పచ్చికాపలం వచ్చి జీవిస్తున్న నన్ను ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావని ఆగ్రహించిన ప్రియుడు చంటి. ఇద్దరి మధ్య వాగ్వాదం మాట మాట పెరిగి గీతను కత్తితో పొడిచిన ప్రియుడు చంటి. గాయపడిన గీతను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెదురు కుప్పం పోలీసులు.
Admin
Famous TV