Monday, 27 July 2026 09:54:02 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు

Date : 26 June 2025 08:44 PM Views : 637

Famous TV - క్రైమ్ వార్తలు / సూర్యాపేట : సూర్యాపేట ఫేమస్ టీవి న్యూస్ : సినిమాలకు దిట్టైనా సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగులోకి రావడంతో ప్రజల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పదిమంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి, విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకుని, కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికే స్కామ్‌కు పాల్పడినట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్నీ ఫోర్జరీ పత్రాలతో సిద్ధం చేసి, బాధితులను మరియు దాతలను ఏర్పాటుచేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆపరేషన్ సమయం దగ్గరపడినప్పుడు, ముఠా సభ్యులు బాధితులను వదిలేసి పారిపోతూ, డబ్బులను పంచుకునే కుతంత్రం చేపట్టినట్లు చెప్పారు. గతేడాది డిసెంబరులో కోదాడ శ్రీరంగపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇదే విధంగా మోసానికి గురై, 22 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా దాదాపు పదిమందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీలు మార్పిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముఠాలోని ఆరుగురు.. కడుపూరి తాతారావు, కొండం రమాదేవి, బొందిలి పృద్వీరాజు, కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణు వర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్ లు ఇప్పటికే అరెస్టుకాగా, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా విచారణ జరిపి నిందితులను పట్టుకున్న సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్ మరియు వారి బృందాన్ని డి.ఎస్.పి అభినందించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: