Sunday, 26 July 2026 07:30:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న పవిత్రోత్సవాలు ప్రారంభం..!

Date : 14 September 2024 08:17 PM Views : 661

Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ మండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో జరిగిన వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగ న్యారాధన, రక్షా బంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. అనంతరం పవిత్ర మాలలు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకు వచ్చారు. ఉదమం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను వైభవంగా చేశారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా ఉత్సవర్లను అభిషేకం చేశారు.సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు గ్రామంలో ఊరేగుతూ. భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథ రెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: