Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామం లోని శ్రీకోదండ రామస్వామి దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, రేపతి దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అమరరాజా సంస్థల అధినేతలు, ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు గల్లా రామచంద్రా నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద భూమన కరుణాకర రెడ్డి, రేవతి దంపతులకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేయించారు. ఆలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భూమన దంపతులు పాల్గొన్నారు. అర్చకులు దర్శన ఏర్పాట్లు చేపట్టి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Admin
Famous TV