Sunday, 26 July 2026 07:29:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అత్యంత వైభవోపేతంగా పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ - కుంభాభిషేక మహోత్సవ రెండవ రోజు పూజ కైంకర్యాలు, వేడుకలు:

Date : 13 February 2024 03:00 PM Views : 714

Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట,13-02-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా రెండవరోజు 13-02-2024 (మంగళవారం)పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 8:00 గంటలకు వేద స్వస్తిగో పూజ, యంత్రార్చన ,ప్రధాన కుంభా వాహనలు, గణపతి అష్ట ద్రవ్య హవనము, ప్రతిష్టించబోయే సమస్త దేవతవిగ్రహాలకు పంచగవ్యము, క్షీరము, నదీ నదా, సముద్ర జలములతో గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి మరియు గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా పూజాభిషేకములు నిర్వహించారు. అలాగే సాయంత్రం 4:00గంటలకు మూషిక వాహనము, గరుడ వాహనము హనుమంత వాహనము, గంట, రథము మరియు శిలా గజములకు దాతల చేత పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు.సాయంత్రం 5:00 గంటల నుండి యాగశాల మండప అర్చకులు వివిధ దేవత హోమములు నిర్వహించిన తదుపరి తీర్థప్రసాదాలు వినియోగము చేసిన తరువాత అమరరాజా విద్యా సంస్థల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తాదులను అలరించాయి. భక్తాదులందరూ జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ తన్మయత్వం చెందారు. ఇలా రెండవరోజు కార్యక్రమం ముగిసింది.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు,గూంటూరు (ఎం పి) గల్లా జయదేవ్ గారు , సర్పంచ్ గల్లా రాధాకృష్ణ , ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా సంపత్ నాయుడు, గల్లా దామోదర ప్రసాద్ ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :