Monday, 27 July 2026 08:51:16 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమల భక్తులకు అలర్ట్: రద్దీ దృష్ట్యా TTD కీలక నిర్ణయం

Tirumala Darshan Updates

Date : 21 May 2023 03:03 PM Views : 344

Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను తీసుకోబోమని ప్రకటించింది. దీంతో పాటు కొన్ని సేవల్లో కూడా స్వల్ప మార్పులు చేసింది. ఆ వివరాలు..తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్‌ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు (Tirumala Darshan) తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో (శుక్ర, శని, ఆది వారాల్లో) ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది. జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. శనివారం (మే 20) ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :