Monday, 27 July 2026 08:48:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమల నడక మార్గంలో కంచె ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు

Date : 09 September 2023 04:17 PM Views : 541

Famous TV - భక్తి / తిరుపతి : తిరుమ‌ల న‌డ‌క మార్గంలో భ‌క్తుల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పై టీటీడీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. ఇప్ప‌టికే భ‌క్తుల‌కు క‌ర్ర‌ల పంపిణీకి టీటీడీ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ర‌లు ఇవ్వ‌డంతోనే భ‌క్తుల భ‌ద్ర‌త బాధ్య‌త‌లు తీరిపోయిన‌ట్టు కాద‌ని, కొంత వ‌ర‌కూ ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చేందుకు దోహ‌దం చేస్తాయ‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే.న‌డ‌క దారి భ‌క్తులు క్రూర‌మృగాల బారిన ప‌డ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే మూడు నెల‌ల కాలంలో ఐదు చిరుత‌ల‌ను టీటీడీ, అట‌వీఅధికారులు సంయుక్తంగా ప‌ని చేసి ప‌ట్టుకున్నారు. మ‌రిన్ని చిరుత‌లు సంచ‌రిస్తున్నాయ‌ని సీసీ కెమెరాల ద్వారా ప‌సిగ‌ట్టారు. దీంతో న‌డ‌క దారి భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు కంచె ఏర్పాటుకు టీటీడీ క‌స‌ర‌త్తు చేస్తోంది.ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తిని టీటీడీ కోరింది. అయితే కంచె ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల చిరుత‌ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయాన్ని అట‌వీశాఖ అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 12న ఎక్స్‌పర్ట్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అలిపిరి, శ్రీ‌వారి మెట్టు నడకమార్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారి స‌మాచారం. ఈ క‌మిటీ నివేదిక ఆధారంగా న‌డ‌క మార్గాల్లో ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో టీటీడీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది. మ‌రోవైపు ఆప‌రేష‌న్ చిరుత కార్య‌క్ర‌మాన్ని అట‌వీశాఖ‌తో క‌లిసి టీటీడీ కొన‌సాగిస్తోంది. భ‌క్తుల భ‌ద్ర‌తే మొద‌టి ప్రాధాన్యం కింద చిరుత‌ల‌ను పట్టుకుంటామ‌ని టీటీడీ ఉన్న‌తాధికారులు చెప్ప‌డం విశేషం.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :