Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట,14-02-2024: అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా మూడవరోజు 14-02-2024 (బుధవారం)పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 4:00 గంటల నుండి శ్రీ గణపతి ,వేణుగోపాల విగ్రహాలకు పూజలు నిర్వహించి, బ్రహ్మి ముహూర్త సమయంలో శ్రీ మహాగణపతి స్వామి వారు మరియు మూషిక వాహనం ,వేణుగోపాల స్వామి వారి విగ్రహ స్థాపన నిర్వఘ్నంగా జరిగింది.ఉదయం 8:00 గంటల నుండి వేద స్వస్తి, ప్రతిష్ట మూర్తులకు ఓషధులు, శ్రీరామ సహస్రనామ హవనము, శ్రీ ఆంజనేయ సహస్ర హోమములు, దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి మొదలగు పూజా కార్యక్రమంలో గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి మరియు గల్లా రామచంద్ర నాయుడు గారి చేతుల మీదుగా అర్చకులు నిర్వహించే తీర్థ ప్రసాద వినియోగము జరిగెను.అలాగే సాయంత్రం 7:00గంటలకు పండరి భజనలు, కోలాట భజనలు, ఒక కార్యక్రమాలు భక్తాదులను అలరించాయి. ఈ విధంగా మూడవరోజు పూజా కార్యక్రమాలు ముగిసాయి. అలాగే రేపు ఉదయం నాలుగు గంటల నుంచి కోదండ రామస్వామి మహా కుంభాభిషేకం అనంతరం 10 గంటలకు సీతారాములు కళ్యాణ మహోత్సవాలు జరుగును.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు,గూంటూరు (ఎం పి) గల్లా జయదేవ్ గారు , సర్పంచ్ గల్లా రాధాకృష్ణ , ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా సంపత్ నాయుడు, గల్లా దామోదర ప్రసాద్ ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Famous TV