Sunday, 26 July 2026 04:56:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైభవం... కల్యాణ వెంకన్న రథోత్సవం..!

Date : 25 September 2023 01:05 PM Views : 548

Famous TV - భక్తి / తిరుపతి : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రాతఃకాల సమయంలో సుప్రభాతంతో మేల్కొలిపి దైనందిన పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను అలంకార మండపానికి వేంచేపు చేసి రథంపై కొలువు దీర్చారు. బ్రహ్మరథంపై కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణలతో శ్రీవారి బ్రహ్మరథం ముందుకు కదిలింది. గ్రామ పురవీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఉప్పు, మిరియాలు రథంపై చల్లి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు స్వామి వారు ఆశీనులైన బ్రహ్మ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మరథానికి ముందు భజన బృందాలు, కోలాటాలు , పిల్లన గ్రోవి కళాకారులు, వేద పండితుల మంత్రాలు ఎంతో అలరించాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: