Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం చెరుపల్లె ఉర్దూ పాఠశాల యందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తమండలి సహకారంతో శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దాం అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే అనేక అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే వాతావరణ మార్పులు వలన అనేక నష్టాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు చెట్లను నాటి సంరక్షించాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు ప్రతి విద్యావంతుడు తన వంతు బాధ్యతగా పది చెట్లనైన నాటి సంరక్షించాలని బ్రహ్మాండచారి విజ్ఞప్తి చేశారు పాఠశాల హెచ్ఎం ఎన్ నౌ షాద్ బేగం మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తమండలికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు పాఠశాల చైర్మన్ ఆశా బేగం మహమ్మద్ హుస్సేన్ మహేంద్ర విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు
Admin
Famous TV