Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జె.సి.ఐ తిరుపతి విభాగం వారు తయారు చేసిన ఆన్లైన్ రక్తదాన జాబిత వెబ్సైట్ ను, https://tirupatiblood.com/ మన తిరుపతి శాసనసభ్యులు గౌ।। ఆరణి శ్రీనివాసరావు గారి చేతుల మీదగా ప్రారంభమైనది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను చెబుతూ జె.సి.ఐ తిరుపతి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ వెబ్సైట్ తయారు చేసిన సంస్థ సభ్యుల కృషిని ఎంతో మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు టి.వై.చైతన్య తేజ్, పూర్వ అధ్యక్షులు గుణశేఖర్, కార్యదర్శి ఆర్.శేష సాయి, కోశాధికారి దిలీప్ కుమార్, ముఖ్య నాయకులు జి.ఎల్. మనోహర్, శంకరయ్య, ఎం.బాబు, నామా రాజేష్, మని సందీప్, జెకామ్ చైర్మన్ సయెద్ సుమయ్య, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Famous TV