Monday, 27 July 2026 08:49:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జెసిఐ ఇండియా ఉపాధ్యక్షునిగా హర్షవర్ధన్ రెడ్డి

Date : 02 January 2024 05:52 PM Views : 721

Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : తిరుపతికి చెందిన ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ (జె సి ఐ) ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బెంగుళూరు హిల్టన్ హోటల్లో జరిగిన జాతీయ సదస్సు సందర్భంగా ఎన్నికయ్యారు. రేకేష్ శర్మ ( కేరళ)ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా హర్షవర్ధన్ తో పాటు కార్తికేయ మధ్యస్థ ( కర్ణాటక), గుడిత్ సింగ్ సహ్మే ( ఉత్తర ప్రదేశ్), రమేష్ దాడిగల ( తెలంగాణ) ఇషాన్ అగర్వాల్ ( గుజరాత్) ఎ. శరవణన్ ( తమిళనాడు) ఎన్నికయ్యారు. 2018లో జె సి ఐ తిరుపతి శాఖ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2019లో జోన్ ఉపాధ్యక్షుడు, ఆసియా పసిఫిక్ డెవలెప్మెంట్ కౌన్సిల్ అధికారిగా ఉన్నారు. 2020లో జోన్ డైరెక్టర్, 2021లో జోన్ అధ్యక్షుడుగా సేవలు అందించారు. 2022 లో జె సి ఐ జాతీయ ఫౌండేషన్ సభ్యునిగా, 2023 లో జాతీయ డైరెక్టర్ అయ్యారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.గత మూడేళ్లలో నెస్లే సంస్థ సహకారంతో ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ నుంచి జె సి ఐ ఉపాధ్యక్షుడు అయిన మొదటి వ్యక్తి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి కావడం విశేషం. బహుముఖ ప్రజ్ఞాశాలి కావడం, సమాజ సేవలో విశేష కృషి చేయడం ఆయన ఎదుగుదలకు కారణం. ఆయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.తిరుపతి ఐఐటిలో అంతర్జాతీయ అధికారిగా పనిచేశారు. వెల్లూరు వి ఐ టి లో పి హెచ్ డి చేస్తున్నారు. విద్యార్థి దశలో టెన్నిస్, బ్యాడ్మింటన్, టెక్వాండో, రోలర్ స్కేటింగ్, స్కేటింగ్ హాకీ క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించారు.ఒకే సారి ఎంబిఎ, ఎం ఎస్ డబ్ల్యు, ఎం ఎస్ సైకో థెరపీ పాసయ్యారు. శ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ అధ్యాపకుడు, విభాగాధిపతి బాధ్యతలు నిర్వహించారు.వ్యక్తిత్వ వికాస శిక్షణకునిగా సేవలు అందిస్తున్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :