Sunday, 26 July 2026 01:39:35 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు - వే ఫౌండేషన్

Date : 07 January 2024 07:36 PM Views : 1583

Famous TV - సామాజిక సేవ / : వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా ఎస్.వి. యూనివర్సిటీ లోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్. వి.యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ ప్రొ. బి. శ్యామ్ డేవిడ్ రాజు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ ఈమె జయంతిని సందర్భంగా వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినలకు సత్కారం ఏర్పాటుచేయడం ముదావహo అని అన్నారు.అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని గుర్తు చేశారు.తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ డా.వెంకట నారాయణ మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి,కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,పితృస్వామ్యానికవ్యతిరేకంగా శూద్రుల,అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు.వే ఫౌండేషన్ వారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. మహదేవమ్మ,డా. శ్రీరాములు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ అధ్యక్షులు టి. గోపాల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మధుసూదన్, రాయలసీమ మిమిక్రీ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, గిరిజన నవ సమాజ్ ప్రెసిడెంట్ పి. శివ శంకర్ నాయక్,కె.రెడ్డి ప్రసాద్, డా. కడివేటి మునిరత్నం,మునింద్ర, మునిలక్ష్మి,తేజస్విని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: