Famous TV - సామాజిక సేవ / : గురువారము ఎస్వీ వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు , నారాయణాద్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డా.సునంద కుమార్ రెడ్డి అందించిన సహాయంతో నిర్మించిన నారాయణాద్రి పెవిలియన్ ఆర్చ్ ప్రారంభోత్సవం మరియు సమర్పణ. సుమారు రూపాయలు 15 లక్షలు విలువ గలిగిన నిర్మాణాన్ని ఈరోజు ఎస్వీ వైద్య కళాశాలకు వితరణ చేయడం జరిగినది. ఈ ఆర్చ్ నిర్మాణం డాక్టర్ తులసీరామ్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఎస్ వి వైద్య కళాశాల , డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ ( DPL ) పెవిలియన్ మరియు భాను (APSMIDC) వారి కృషితో నిర్మించబడిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు నారాయణాద్రి హాస్పిటల్‌కి అప్పగించబడుతున్న సందర్భంగా , గౌరవ సూచకంగా ఎస్ వి వైద్య కళాశాలకు అందించడం జరుగుతుంది. ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్, డా.పి.ఎ.చంద్రశేఖరన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, పారామెడికల్ మరియు ఆఫీస్ సిబ్బంది, తదితరులు అందరూ వివిధ ఆట పోటీలు, ఎస్ వి వైద్య కళాశాల క్రీడా మైదానంలో వివిధ ఆట పోటీలు నిర్వహించడానికి అనుకూలంగా, దీన్ని ఆహ్లాదించడానికి టీమ్స్ ని ఎంకరేజ్ చేయడానికి పెవిలియన్ ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, అదనపు సూపర్డెంట్ డాక్టర్ సుబ్బారావు, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సత్యనారాయణ మూర్తి వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ ఫాహీమ్, డాక్టర్ మదన్, మదర్ హాస్పిటల్, డాక్టర్ శ్రీధర్ శ్రీ హాస్పిటల్, డాక్టర్ చరణ్ సింగ్ మాజీ ప్రిన్సిపాల్ పద్మావతి మహిళా వైద్య కళాశాల, ఫిజికల్ డైరెక్టర్ శరవణ, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్వో, వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV