Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె, ఏప్రిల్ 12 సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని ప్రస్తుత మారుతున్న పరిస్థితులలో నీటిని పొదుపుగా వాడాలని బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి తెలిపారు. శుక్రవారం పలుకూరు గ్రామంలోని రామాలయం నందు జెకేఆర్ సంక్షేమ సంఘం తరపున భక్తిదాయకమైన పుస్తకాల పంపిణీ మరియు నీటి యొక్క ప్రాధాన్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రహ్మానందాచారి మాట్లాడుతూ వర్షాలు తగ్గిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని దీంతో తీవ్ర నీటి ఎద్దడి పలు ప్రాంతాల్లో ఎదురవుతుందని తెలిపారు.ప్రస్తుతం వేసవికాలంలో అన్నిటి సమస్య జటిలంగా మారుతుందని అన్నారు.నీటి ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడాలని లేకుంటే రాబోయే కాలంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంగళూరు నగరం మరియు ఇతర ప్రాంతాలలో నీటి ఎద్దడి పరిస్థితులను వివరించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కాలం ప్రకారము రుతువుల ప్రకారము నడవడం లేదని గుర్తు చేశారు. దీంతో నీటి సమస్య పెరిగిపోతుందని అన్నారు.భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేయాలని,ప్రతి ఒక్కరూ 10 మొక్కలను పెంచి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కేఈ వెంకటసుబ్బయ్య గౌడు,బాల హనుమంతు,రాజు,శ్రీనివాసులు, సావిత్రి,రవణమ్మ,భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV