Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామతీర్థం జిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జి ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల పట్టణానికి చెందిన విద్యా భారతి ఫౌండేషన్ చైర్మన్ సుబ్బరాజు సహకారంతో మొదటి బ్యాంకు 100 సూత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాల పంపిణీ మరియు విద్యా విశిష్టతపై ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదల తోనే విజయం మీ సొంతం అన్నారు విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు విద్యా విశిష్టత నైతిక విలువలు కష్టపడితే సాధించే విజయాలను వివరించారు ఇంచార్జ్ హెచ్ఎం సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దాతైన సుబ్బరాజు కృతజ్ఞతలు తెలిపారు విద్య యొక్క విశిష్టత వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్ బద్రి నారాయణ వెంకటస్వామి సురేంద్ర బాబు నాగ పుల్లమ్మ సుధాకర్ మొదలగువారు మాట్లాడిన అనంతరం మొదటి ర్యాంకు వంద సూత్రాలు పుస్తకాలు పంపిణీ చేశారు.
Admin
Famous TV