Famous TV - సామాజిక సేవ / తిరుపతి : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు భాగంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణం నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మాభాష మాట్లాడుతూ మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవ స్ఫూర్తితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకల్లో భాగంగా సూళ్లూరుపేట పట్టణం నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు 33 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారని రక్త దానం చేసిన మెగా అభిమానులకు జన సైనికులకు పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. పట్టణంలో ఎవరికి రక్తం అవసరం అయినా మమ్మల్ని సంప్రధిస్తే మా వంతు బాధ్యతగా రక్తమందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు హరిబాబు, శరవణ, రేవంత్, హేమంత్, మరియు జనసేన నాయకులు రాజా, దాస్, జగదీష్, మరియు నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మోటివేటర్ భాస్కర్ రావు గారు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు
Admin
Famous TV