Famous TV - విద్య ఉద్యోగాలు / : పూతలపట్టు , 25.04.2025: NTA విడుదల చేసిన JEE MAINS పరీక్షా ఫలితాలలో చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పెటమిట్ట నందు గల మంగళ్ విద్యాలయ విద్యార్థులు అత్యుత్తమ శాతం ఉత్తీర్ణత సాధించి ఘనకీర్తిని చాటారు. పాఠశాల నుంచి 29మంది పరీక్షకు హాజరుకాగా అందులో 17మంది అడ్వాన్స్ కు హర్హత సాధించారు. వీరిలో B.Paneedra kumar 98.23 శాతం తో AIR- GEN - EWS - 4424వ ర్యాంకు సాధించి పాఠశాలలో ప్రథమస్థానంలో నిలిచాడు, B.కార్తికేయ రెడ్డి 95.30 శాతం తో AIR - GEN - EWS 11,781వ ర్యాంకుతో పాఠశాలలో రెండవ స్థానం లో నిలిచాడు, P.లహరి 94.12 శాతం తో 14674వ ర్యాంకుతో పాఠశాలలో మూడవ ర్యాంకు సాధించింది. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని మరియు తల్లిదండ్రులను అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు అభినందించారు.
Admin
Famous TV