Sunday, 26 July 2026 05:02:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

'యువత అసాధ్యమైన పనులను గట్టిగా ప్రయత్నించి చూడండి ' 'కౌటిల్య' లో సదస్సు : "ఐ.ఐ.ఎం విద్యార్థులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ సందేశం"

Tirupati Joint collector- DK Balaji, IAS felicitates the IIM admission achievers of Kautilya

Date : 08 June 2023 07:59 PM Views : 630

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ వద్ద వున్న "కౌటిల్య ఇన్స్టిట్యూషన్ " సంస్థ కి చెందిన 11 మంది కి పైగా తిరుపతి విద్యార్థులు కు ఈ జూన్ నెలలో విడుదల చేసిన తుది ఫలితాలలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మక కాలేజీ లు అయిన ఐ.ఐ.ఎం.(ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ ) లలో MBA అడ్మిషన్ సాధించారు. వీటిలో దేశం లోనే ప్రతిష్టాత్కమైన ఐ.ఐ.ఎం అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో సంస్థలు వున్నాయి. ఈ సందర్భంగా 'కౌటిల్య' లో 'అఛీవర్స్ మీట్' అనే కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ, ప్రత్యేక అతిధి గా ఎస్.వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.వి.ఎస్.సత్యనారాయణ హాజరయ్యారు. దీనిలో కౌటిల్య డైరెక్టర్ శ్రీధర్, బోధనా సిబ్బంది ఎన్.హరి, ఎన్.ఎస్.రెడ్డి, తదితరులు హాజరయ్యారు. మరియు ఈ ఐ.ఐ.ఎం అడ్మిషన్ సాధించిన విద్యార్థులను వారి తల్లి తండ్రులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వారి తల్లితండ్రులు హయారయ్యారు.

జాయింట్ కలెక్టర్ ఉపన్యాసం : నేను ఐఏఎస్ సాధించడానికి కారణం అసాధ్యం అనుకొనేవి మరియు సంప్రదాయేతర నిర్ణయాలు తీసుకోవడం. జీవితం అపారమైన అవకాశాలు ఇస్తుంది. మీకు సానుకూల దృక్పథం ఉంటే మీకు ఇవి కనిపిస్తాయి. మీకు ప్రతికూల దృక్పథం ఉంటే జీవితం మీకు నిరాశగా కనిపిస్తుంది. నేను కర్ణాటక లో చాలా మందికి పేరు తెలియని గ్రామం లో పుట్టాను.నేను చిప్పటినుండి నా చదువుతో పాటు జనరల్ నాలెడ్జి పై దృష్టి సారించాను. దినపత్రికలు, మ్యాగజైన్స్ చదవడం, క్విజ్ షో లు చూడడం- ఇవన్నీ కూడా సంప్రదాయేతర నిర్ణయాలు క్రింద వస్తాయి. అనగా చాలా మంది విద్యార్థులు చెయ్యని పనులకు నేను పూనుకొనడం. నాకు చిన్నపుడు అసలు ఇంగ్లీష్ రాదు. అప్పుడు నేను కాలేజీ కి వెళ్లే బస్సు లో ప్రతి రోజు కన్నడ మూవీస్ చూసి వాటి ఇంగ్లీష్ తర్జుమా చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇలా నాకు ఎదుర్కొన్న సమస్యను ఛేదించా. ఈ విధంగా విద్యార్థులకు జీవితం లో అనేక సమస్యలు వస్తాయి. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మీరు ప్రతికూల ధోరణిని విడనాడండి. ఇప్పుడు యువతకు ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అవకాశాలు వున్నాయి. వాటిని వినియోగించుకోండి. నేను కోచింగ్ పై ఆధార పడకుండా, టీచింగ్ చేస్తూ ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యాను. మొదటిలో వైఫల్యాలను ఎదుర్కొన్నాను. తర్వాత ధైర్యం కోల్పోకుండా మరల సానుకూల దృక్పథం తో ప్రయత్నించా. జాతీయ స్థాయిలో 36 ర్యాంకు సాధించా. నా మొత్తం ప్రయాణం లో మీరు నేర్చుకోవాల్సినిది ఏంటంటే, నాది గ్రామీణ నేపథ్యం, ఇంగ్లీష్ రాదు, ఐఏఎస్ కుటుంబ నేపథ్యం లేదు. ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నా, పోరాడా, సాధించా.దీని ద్వారా మీరు కూడా విజయం సులభంగా సాధించవచ్చు

ఆర్.వి.ఎస్. సత్యనారాయణ ఉపన్యాసం : మా ఎస్.వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదివిన ఏ. మహేశ్వర్ కౌటిల్య లో కోచింగ్ తీసుకోని ఐ.ఐ.ఎం అహ్మదాబాద్ లో MBA అడ్మిషన్ సాధించడం అందరి విద్యార్థులకు స్ఫూర్తి. చాలా మంది మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌటిల్య కోచింగ్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఐ.ఐ.ఎం లలో MBA అడ్మిషన్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు, విదేశీ విద్యలో విజయాలు సాధిస్తున్నారు. వీరికి అబినందనలు. నా అనుభవం లో చూస్తే ఇన్స్టిట్యూషన్ (విద్య సంస్థ)  కి ఇండస్ట్రీ (పరిశ్రమ) కి మధ్య అంతరం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులకు స్థిరమైన వుద్యోగం సంపాందించడం లో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. సాఫ్ట్ వేర్  లో ఆర్ధిక మాంద్యం - ఉద్యోగుల తొలగింపు అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఇలాంటి గడ్డు పరిస్థితులలో  నైపుణ్యం లేని ఉద్యోగులపై మాత్రమే మొదటి వేటు పడుతుంది. అదే నైపుణ్యం కల్గిన వారిపై ఈ మాంద్యపు ప్రభావం ఎక్కువగా ఉండదు. కాబట్టి  మీరు పరిశ్రమ లో ఎలాంటి నైపుణ్యాలు కావాలో ఇప్పుడు కాలేజీ దశలోనే తెలుసుకొని, కేవలం తరగతి గదులలోని సిద్ధాంతాలను బట్టి కొట్టడం కాకుండా, రోజు రోజు కు మారి పోతున్న ప్రపంచానికి అనుగుణంగా   విద్యను పరిశోధించి దానిపై నైపుణ్యం తో కూడిన  పట్టు సాధించడమే '. అయితే మీరు ఈ లక్ష్యం లో విజయం సాధించాలంటే, మీ చదివే విధానం తో పాటు , మీ వ్యక్తిగత  వైఖరి లో కూడా మార్పులు చెయ్యాలి. శ్రీధర్ ఉపన్యాసం : ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లడుతూ 'ముందున్నవాళ్లకు ముందే అవకాశాలు దొరుకుతాయి ' అనే సామెత ఈ క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్ ) చాలా బాగా పని చేస్తుంది. అంటే విద్యార్థులు తమ డిగ్రీ / లేదా బి.టెక్ చదువుతున్నప్పుడే తమ ఖాళీ సమయాన్నిఈ క్యాట్ పరీక్షకు బాగా ఉపయోగించుకోవాలి. సాధారణ డిగ్రీ- బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి లకు మరియు అమ్మాయిలకు ఐ.ఐ.ఎం లు అడ్మిషన్స్ విషయం లో చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నాయి. క్యాట్ లో స్కోర్ తో పాటు, ఇంగ్లీష్ పై మరీ ముఖ్యంగా భావ వ్యక్తీకరణా నైపుణ్యాలు పై పట్టు వున్న అభ్యర్థులు కు ఐ.ఐ.ఎం లు ఆహ్వానం పలుకుతాయి. ఈ కాలేజీ లలో చదివిన వారికీ కోటి రూపాయల వరకు కూడా వార్షిక వేతనాలు కూడా లభిస్తున్నాయి . మన జిల్లా లోని ఎవరైనా ఈ క్యాట్ మరియు ఐ.ఐ.ఎం అడ్మిషన్స్ కు సంభందించి ఉచిత గైడెన్స్ కావాల్సిన వాళ్ళు మా తిరుపతి కౌటిల్య సంస్థను 9698123456 కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఐ.ఐ.ఎం అడ్మిషన్ పొందిన కౌటిల్య సంస్థ విద్యార్థులు ఉపన్యాసం : ఏ.మహేష్ (ఐ.ఐ.ఎమ్ -అహ్మదాబాద్) మాట్లడుతూ " నేను నా ఎమ్.బి.ఏ పూర్తి చేసిన తర్వాత పరిశ్రమ పై మంచి అవగాహన పెంచుకొని సొంతం గా స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి యువతకు తోడ్పడాలనుకొంటున్నాను. శ్రీకాకుళం లో వున్న మా తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకొంటున్నాను. ఐ.ఐ.ఎమ్ లో అడ్మిషన్ సాదించాలను కొనే విద్యార్థులు మంచి పట్టుదల, సానుకూల దృక్పథం తో పాటు శాస్త్రీయ ప్రేపరషన్ చెయ్యాలి. అదే విధంగా మంచి గురువుల సహాయంతో తమ ప్రేపరషన్ లో తప్పులు తెలుసుకోవాలి కూడా. " కరణం చందన మాట్లడుతూ " నేను బి.టెక్ తర్వాత డెలాయిట్ కంపెనీ లో పని అనుభవం సంపాదించా. సాంకేతిక నైపుణ్యం తో ఇప్పుడు ఐ.ఐ.ఎమ్ బెంగళూరు లో అడుగుపెడుతున్నాను. నవకల్పనలతో ముందుకు పోవాలనుకొంటున్నాను. విద్యార్థులు ఆన్ లైన్ లో క్యాట్ పరీక్షలు సాధన చెయ్యాలి మరియు క్యాట్ లో తక్కువ స్కోర్ వస్తే నిరుత్సాహ పడకుండా మరల మరొక సారి ప్రేపరేషన్ చెయ్యవచు. కేతన్ రెడ్డి : ఇండియా లోని టాప్ ఐ.ఐ.ఎమ్ - లక్నో లో సీట్ సాధించా. వీటిలో మేనేజ్ మెంట్ విద్య ద్వారా అత్యంత ఆధునాతన నిర్వహణ నైపుణ్యాలు , నాయకత్వ లక్షణాలు అంది పుచ్చుకోవచ్చు. తద్వారా దీర్ఘకాల భవిషత్తులో మనమే కొత్త కంపెనీలను స్థాపించవచ్చు కూడా. మన దేశం లో టాలెంట్ వున్న యువతతో జత కట్టి మన దేశ ఆర్ధిక రంగంలో అనేక విప్లవాత్మక విజయాలు సాధించవచ్చు మరియు సమాజం లో యువతకు సహాయ పడి, వీలైనంత వరకు మార్గదర్శి గా ఉండాలని అనేది నా దీర్ఘ కాలిక లక్ష్యం. ఐ.ఐ.ఎమ్ ఆశావహులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి. నేను దీని కోసం కౌటిల్య చాలా మంది విద్యార్థులకు క్లాసులు బోదించా. ఇది నాకు ఇంటర్వ్యూ లలో చాలా బాగా ఉపయోగపడింది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :