Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : మంగళవారము ఎస్వి వైద్య కళాశాలో యం.బి.బి.ఎస్. కోర్సు నందు 2023-24 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది.నీట్ ఎంట్రన్స్ ద్వారా (అల్ ఇండియా కోటా లో) ర్యాంకులను సాధించిన మెడికల్ విద్యార్థులు ఎస్.వి వైద్య కళాశాల నందు తిరుపతి పట్టణానికి చెందిన ఎస్టీ కేటగిరీ క్రింద బి.బాలవర్ధన్ రాథోడ్, యం.బి.బి.ఎస్. కోర్సులో ప్రవేశం పొందారు. తిరుపతి కి చెందిన విద్యార్థి 536 మార్కులు పొంది జాతీయ స్థాయిలో 75,443 ర్యాంకుసాధించి ఎస్ వి వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్ పొందారు.
ఈ రోజు ఇద్దరు విద్యార్థిలు - యం.బి.బి.ఎస్. లో అడ్మిషన్స్ పొందారు. ఈ కార్యక్రమానికి ఎస్ వి.వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర దేవి ( అకాడమిక్) అడ్మిషన్స్ పొందిన విద్యార్ధినులకు అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, సామాజిక వైద్య విభాగాధిపతి, డాక్టర్ ఆది నటేష్, మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV