Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి రుయా ఆసుపత్రి కి ఆపరేషన్ థియేటర్ బయట రోగి బంధువులు కూర్చోవడానికి వీలుగా వుండేందుకు బెంచ్ లు ఈ రోజు తిరుపతి గ్రేటర్ లయన్స్ క్లబ్ వారు రుయా ఆసుపత్రికి వితరణ చేయడం జరిగినది. ఈ మధ్య రుయా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైనందున ఆపరేషన్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగి నది. దీనితో ఒక్కొక్క రోగికి ముగ్గురి నుంచి నలుగురు రోగి బంధువులు రావడం జరుగుతుంది.వారు అందరూ ఆపరేషన్ బయట వేచి ఉండడం ,వారు కూర్చోవడానికి కొద్దిగా ఇబ్బంది వుండడం జరుగుతుంది. దీనిని గమనించిన తిరుపతి గ్రేటర్ లయన్స్ క్లబ్ వారు నాలుగు చెక్క బెంచ్ లు రూపాయలు 50,000 విలువ కలిగిన బెంచీలు, ఈ రోజు రుయా ఆసుపత్రి వితరణ చేయడం జరిగినది. సూపరిటెండెంట్ డా.జి.రవి ప్రభు కి అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి లైన్స్ క్లబ్బు లాంటి దాతలు ముందుకు వచ్చినట్లయితే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లైన్స్ క్లబ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డా. జి.రవి ప్రభు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డా .సాయి ప్రసాద్ , సెక్రటరీ డా.జయశంకర్ , ట్రెజరర్ డా.సునంద కుమార్ రెడ్డి ,డా.బాలాజీ ,డా పార్థసారధి ,డా. ఏ ఆర్ రెడ్డి పాల్గొన్నారు.
Admin
Famous TV