Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవీ చిత్తూరు జిల్లాలో 27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు సోమవారం ఓ ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది.జిల్లాలో మొత్తం 612 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేయవలసిన సిబ్బంది సంఖ్య 4,477 ఉండగా, ప్రస్తుతం 4,040 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.మిగిలిన 437 మంది విధులకు హాజరు కావడం లేదని ఎంపిడిఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలియజేశారు.ఈ 437 మందిలో 152 మంది మెడికల్ లీవ్‌లో ఉన్నారు, 251 మంది వివిధ శాఖల్లో డెప్యుటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు, 27 మంది అనధికారిక సెలవులో ఉన్నారు.దీనిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితిలో, అనధికారికంగా సెలవులు తీసుకోవడం సరికాదని పేర్కొంటూ,వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.దీననుసరించి, అనధికారిక సెలవులో ఉన్న 27 మంది సిబ్బందిపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా, మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డుకు పంపించి పరీక్షలు నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.అందువల్ల, అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం సెలవులో ఉన్న సిబ్బంది వెంటనే విధులకు హాజరుకావాలని వారికి సూచించాలని ఆదేశించబడింది. ఇందులో ఏ విధమైన ఆలస్యం జరిగినా, సంబంధిత వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
Admin
Famous TV