Sunday, 26 July 2026 08:29:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్.వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ లో ముగిసిన ప్లేసెమెంట్స్ శిక్షణ

ట్రైనింగ్ మరియు ప్లేసెమెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డి.ఎమ్. శ్రీ మురళి, ఎస్.వి.యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ

Date : 07 July 2023 05:29 PM Views : 464

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ 'ట్రైనింగ్ మరియు ప్లేసెమెంట్ సెల్ ' ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సర విద్యార్థులకు గత 15 రోజుల క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ నేటితో విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణను 'కౌటిల్య ఇన్స్టిట్యూషన్' అనే కంపెనీ చే ఇవ్వబడింది. ఈ కార్యక్రమం లో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ (భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు) పై నిపుణలచే శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ ద్వారా బి.టెక్ విద్యార్థులకు త్వరలో జరిగే అన్ని క్యాంపస్ ప్లేసెమెంట్స్ (ఇన్ఫోసిస్, టి.సి.ఎస్, సి.టి.ఎస్, etc ) లోని రాత, మౌఖిక పరీక్షలకు ఉపయోగపడుతుంది. వీటితో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భర్తీ పరీక్షలు (బ్యాంకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్) లాంటి అనేక పోటీ పరీక్షలకు ఈ శిక్షణ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.వి.ఎస్.సత్య నారాయణ, ట్రైనింగ్ మరియు ప్లేసెమెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డి.ఎమ్. శ్రీ మురళి, కౌటిల్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీధర్, శిక్షకులు (ట్రైనర్లు) మరియు కాలేజీ ప్లేసెమెంట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.వి.ఎస్.సత్య నారాయణ మాట్లడుతూ " ప్రతి సంవత్సరం మా కాలేజీ విద్యార్థులు కు ఇంజనీరింగ్ విద్యతో పాటు, బి.టెక్ పూర్తి కాగానే కార్పొరేట్ కంపెనీ లలో కొలువులకు కావాల్సిన శిక్షణను నిపుణలచే ఇక్కడే ఇప్పిస్తున్నాం. తద్వారా, అనేక మంది విద్యార్థులు మంచి ప్లేసెమెంట్స్ సాధిస్తున్నారు. అలానే విద్యార్థులు అకడమిక్ విద్యతో పాటు, పరిశ్రమ కు కావాల్సిన ఆధునిక నైపుణ్యాల పై పట్టు సాదించాలి. దీనితో పాటు, విద్యార్థులు నాయకత్వం, సానుకూల దృక్పధం వంటి మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవడం ద్వారా కెరీర్ లో మంచి విజయం సాధించవచ్చు. ట్రైనింగ్ మరియు ప్లేసెమెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డి.ఎమ్.శ్రీ మురళి మాట్లడుతూ "విద్యార్థులు ప్లేసెమెంట్స్ కోసం ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ సబ్జక్ట్స్ తో పాటు సాంకేతిక (టెక్నికల్) విషయాల పై కూడా మా ప్లేసెమెంట్ సెల్ ద్వారా ఇండస్ట్రీ నిపుణలచే శిక్షణ ఇప్పిస్తున్నాము. మారుతున్న టెక్నాలజీ లకు అనుగుణంగా విద్యార్థులు కూడా సిద్ధమవ్వాలి. సాఫ్ట్ వేర్ పరిశ్రమ కొంత మాంద్యపు ప్రభావం నేపథ్యంలో విద్యార్థులు మరింత కొత్త నైపుణ్యాలు, సబ్జెక్టు ల పై మంచి అవగాహన, ఇంగ్లీష్ భాషా సామ్యార్ధలు మెరుగు పెరుచుకోవాల్సిన అవసరం వుంది. వీటితో పాటు, విద్యార్థులు ఉద్యోగాలలో మంచి నాయకులుగా ఎదగాలంటే సమయ పాలన, క్రమ శిక్షణ, నిబద్దత వంటి లక్షణాలను అలవర్చుకోవాలి.

కౌటిల్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీధర్ " మీ కెరీర్ లో మీరు స్థిరపడాలన్నా, కార్పొరేట్ కంపెనీలలో మీరు ఉద్యోగ సాధన చెయ్యాలన్నా ముఖ్యంగా మీకు కావల్సినిది తార్కిక ఆలోచన (లాజిక్ ) తో కూడిన పరిజ్ఞానం. దీని ద్వారా ఎంప్లోయబిలిటీ (ఉద్యోగ అర్హత) నైపుణ్యనాలపై పట్టు వస్తుంది. అలానే, కోడింగ్ పై పట్టు సాధించాలంటే కూడా లాజికల్ థింకింగ్ చాలా అవసరం. మీ వ్యక్తిత్వం ను మెరుగు పరుచుకోవడానికి ప్రముఖ రచయిత పుస్తకాలూ చదవండి మరియు స్మార్ట్ ఫోన్ లను అతిగా ఉపయోగించద్దు ' అని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :