Famous TV - జాతీయ వార్తలు / : అలింకో మరియు తిరుపతి ఎంపీ నిధులతో దివ్యాంగులకు ఉపకరణ పరికరాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నెల్లూరు జడ్పి చైర్మన్ ఆనం అరుణమ్మ ఈరోజు నిర్వహించబడిన పంపిణి కార్యక్రమంలో ₹.38 లక్షల.70 వేల రూపాయల విలువ గల 316 ఉపకరణ పరికరాలను 225మంది దివ్యాంగులకు గౌరవ మంత్రి వర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, నెల్లూరు జడ్పి చైర్మన్ ఆనం అరుణమ్మ చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది. మొదటగా ఈ సంవత్సరం మే నెలలో దివ్యాంగులకు ఉపకారణాల పంపిణి చేసేందుకు అలింకో ఆదర్వంలో శిబిరం నిర్వహించబడిన విషయం విధితమే. ఈ శిబిరంలో మోటారైజ్డ్ ట్రై సైకిల్స్ పంపిణీ కొరకు 66 మంది దివ్యాంగులను గుర్తించగా అందులో 35 మంది అర్హులు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన వారీగా అలింకో సంస్థ వారు గుర్తించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉపకారణాల పంపిణీ కోసం ఎంపీ గురుమూర్తి ద్వారా అలింకో సంస్థ వారిని సంప్రదించి అర్హులను గుర్తించేదుకు శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఒక్కో మోటారైజ్డ్ ట్రై సైకిల్ విలువ ₹.42 వేల రూపాయలు కాగా అలింకో వారు 25 వేలు అందించగా మరో 17 వేల రూపాయలు అర్హత పొందిన దివ్యాంగులు కట్టవలసి ఉండగా తిరుపతి ఎంపీ ముందుకు వచ్చి మంచి మనసుతో తన నియోజకవర్గ నిధుల నుంచి ₹.5 లక్షల 95 వేల రూపాయల మొత్తాన్ని కేటాయించి నేడు ఈ వాహనాలను వారికి అందించేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ కోరిన వెంటనే ముందుకు వచ్చి అర్హులను గుర్తించి ఉపకరణాలను పంపిణీ చేసేందుకు సహకరించిన అలింకో సంస్థ వారికీ ధన్యవాదములు తెలియజేశారు. ముఖ్యంగా దివ్యాంగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే స్పందించి అలింకో వారితో మాట్లాడి ఒప్పించామని తెలియజేసారు. నియోజకవర్గ అభివృద్ధిలో కాని నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు గుర్తించడంలో కాకాణి గారు ఆయనకీ ఆయనే సాటి అని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో 66 మందికి మోటారైజ్డ్ ట్రై సైకిల్స్, 24 మందికి కృత్రిమ అవయవాలు, 102 మందికి శ్రవణ యంత్రాలు, 17 మందికి ట్రై సైకిల్స్, మరియు చంక కర్రలు, చేతి కర్రలు, అందుల చేతి కర్రలు, వీల్ చైర్స్, సెల్ ఫోస్, సి.పి చైర్, రోల్లేటర్ లాంటి మొదలగు ఉపకారణాలు దివ్యాంగులకి పంపిణీ చేశారు.
Admin
Famous TV