Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ నేటి సాయంత్రం తిరుపతి విచ్చేసారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి గారితో కలిసి జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారికి తిరుపతి విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసారు. తదుపరి ఆయనతో కలిసి రేణిగుంట మండలం కొత్తపాళెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Famous TV