Famous TV - జాతీయ వార్తలు / : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు (CBI) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అంటే ఇకపై తమిళనాడులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను నరేంద్రమోదీ సర్కారు దుర్వినియోగపరుస్తోందంటూ డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Admin
Famous TV