Famous TV - జాతీయ వార్తలు / : అబ్బో ఎండలు మoడిపోతున్నాయి. భరించలేని వేడి. ఈ తాపం భరించలేము బాబోయ్. ఎంత కాలం ఏ సి ల్లో ఉంటాము.ఇప్పుడు మన దేశం మొత్తంలో 500 కోట్లు వృక్షాలు నాటడం అవసరం అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 45 డిగ్రీల నుండి, 48, 50, 55, 60 డిగ్రీలు ఉష్ణొగ్రత పెరగడంలో ఎక్కువ రోజులు పట్టవు. చెట్లు నాటడం ఎంతైనా అవసరం. చెట్లు నాటడానికి ఎంతో భూమి లభ్యంగా ఉంది. ఇళ్ళ మధ్య స్థలాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలు ఉన్నాయి. స్కూల్ ఆవరణలో ఎంతో స్థలం ఉంది. ఖాళీ స్థలాల లో ప్రతి వ్యక్తి రెండు మొక్కలు నాటడం మొదలు పెట్టి ఒక ఉద్యమంగా కొన సాగిస్తే, వచ్చే ఏడాది కల్లా మన ప్రాంతం లో భూతాపాన్ని కొంత వరకు అయినా తగ్గించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికీ ఒక విన్నపం మాత్రమే.
Admin
Famous TV