Monday, 27 July 2026 08:48:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసిన తిరుపతి ఎంపీ

ఇంటర్-మోడల్ స్టేషన్ ప్రక్రియ వేగవంతం తోపాటుగా పలు రహదారుల నిర్మాణానికి సహకారం కోరుతూ వినతి

Date : 27 July 2023 08:09 PM Views : 617

Famous TV - జాతీయ వార్తలు / : ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సదరు మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలవడం జరిగింది. ఈ బేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత రద్దీగా ఉండే తిరుపతి బస్ టెర్మినల్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఇంటర్-మోడల్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ - పిటిఐ) అభివృద్ధి కోసం నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ప్రాసెస్ ప్రారంభించబడిందని వీలైనంత త్వరగా అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించవలసిందిగా కోరారు.తిరుపతికి విచ్చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారు జాతీయ రహదారి అధికారులకు ఇప్పటికే ఉన్న 4 లేన్ల తిరుపతి బైపాస్‌ను కిమీ 274.800 నుండి కిమీ 294.00 వరకు 19.2 కిమీ అప్‌గ్రేడ్ చేయాలని సూచించడం జరిగింది మరియు దీనికి తోడు ఈ రహదారి విస్తరణ పనులను "పిడి చెన్నై" నిర్వహిస్తోందని, అందువలన అనుసరించడం కష్టంగా మారిందని తిరుపతి జిల్లా యంత్రాంగం నిర్వహించే సమావేశాలకు పీడీ చెన్నైకి చెందిన అధికారులు కూడా హాజరు కాలేకపోతున్నారని, అందువల్ల పీడీ చెన్నై, ఎన్‌హెచ్‌ఏఐ నుంచి పీడీ తిరుపతి, ఎన్‌హెచ్‌ఏఐకి ఈ రహదారి నిర్వహణ మార్చాలని ఈ ప్రక్రియను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.అలాగే శ్రీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారి - 71 నుంచి చెన్నై - సూరత్ గ్రీన్ ఫీల్డ్ రహదారి - 716 ని కలుపుతూ 4.8 కిమీ ల రహదారి మరియు కరకంబాడి - కపిలతీర్ధం మధ్య కొండా కింద రోడ్డు నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయం మరియు దూరాన్ని తగ్గించబడుతుందని కొత్త రహదారి స్థానిక పర్యాటక పరిశ్రమను మడ్డతు ఇస్తూ మరింత మంది పర్యాటకులను ఆకర్షించవచ్చని తిరుపతి పర్యటనలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సూచన ప్రాయ అంగీరాన్ని తెలియజేసిన విషయాన్ని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందుకు సంబందించిన ప్రతిపాదన ఆయనకీ సమర్పించడం జరిగింది.ఏర్పేడు నుంచి ఐఐటీ తిరుపతి వరకు ఎన్. హెచ్ -565ని ఏర్పేడు టౌన్ నుండి ఐఐటీ తిరుపతి సర్కిల్‌ వరకు రెండు లేన్‌లతో అప్‌గ్రేడ్ చేయడం మరియు మెరుగైన పేవింగ్, డ్రైనేజీ మరియు లైటింగ్ అవసరం. అందుకోసం ఏర్పేడు టౌన్ నుండి ఐఐటీ తిరుపతి సర్కిల్ వరకు సిసి రోడ్డు, డ్రైనేజీలు & విద్యుత్ దీపాలతో రెండు లేన్‌లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కోరడం జరిగింది.తడ-శ్రీకాళహస్తి (48 కిమీ), ఉతుకోట- సత్యవేడు- తడ అంతరరాష్ట్ర రహదారి, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల కలిపే ఎన్.హెచ్ 16 ఎహెచ్ గూడూరు నుండి ఎన్.హెచ్ 716 రాజంపేట రెండు జాతీయ రహదారులను కలిపే ఈ మూడు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని అభ్యర్ధించడం జరిగింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :