Famous TV - ఆరోగ్యము / తిరుపతి : సమాజ సేవలో రాజన్న ఫౌండేషన్ అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న. రాజన్న ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పర్యావరణంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమర రాజా లాజిస్టిక్స్ మరియు SV అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వైద్య బృందం సహకారంతో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఎల్ వెంకట్ మాధవ్, ప్రెసిడెంట్ గ్రూప్ గ్రూప్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అమర రాజ మాట్లాడుతూ," సరుకు మరియు వస్తువుల రావణాలో లారీ డ్రైవర్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. కావున ఆ డ్రైవింగ్‌కు మంచి కంటి చూపుఅవసరం,కావున రాజన్న ఫౌండేషన్ అద్వర్యంలో కరకంబాడిలోనీ అమర రాజ కంపెనీ కి వచ్చే లారీ డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఈరోజు నిర్వహించామని అన్నారు." దాదాపు 200 మంది లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మరియు ఈ కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించడానికి సహకరించిన ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యబృందానికి మరియు రాజన్న ఫౌండేషన్ కి అమర రాజ లాజిస్టిక్స్ మరియు డ్రవర్స్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ వెంకట మాధవ్ ప్రెసిడెంట్ గ్రూప్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అమర రాజ , ఆర్ చంద్రబాబు జనరల్ మేనేజర్,లాజిస్టిక్స్,అమర రాజ,రాళ్ళపల్లి సతీష్, హెడ్ రాజన్న ఫౌండేషన్,డాక్టర్ శ్రీలత, ఎస్వీ అరవింద్ హాస్పటల్, మరియు అమర రాజ సిబ్బంది , ఎస్వీ అరవింద్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV