Sunday, 26 July 2026 05:38:26 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

"చేయి చేయి కలిపుదాం."కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం.

తిరుపతి డివిజన్ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎమ్ హెచ్వో డాక్టర్ సుధా రాణి గారు "కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి స్వీయ పరీక్షలు ఉత్తమం

Date : 02 July 2023 01:29 PM Views : 394

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : DLATO డాక్టర్ అరుణ సులోచన గారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది జూన్ 26వ తేదీ నుంచి జులై 16వ తేదీ వరకు నిర్వహించే కుష్ఠు వ్యాధిపై అవగాహన మరియు కుష్ఠువ్యాధి అనుమానితులను గుర్తించే కార్యక్రమాలు."కుష్ఠు వ్యాధిపై అవగాహనా కార్యక్రమం"చేయి చేయి కలిపుదాం."కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం. తిరుపతి డివిజన్ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎమ్ హెచ్వో డాక్టర్ సుధా రాణి గారు "కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి స్వీయ పరీక్షలు ఉత్తమం." అంటూ పిలుపునిచ్చారు. రేణిగుంట మండలం తారక రామ నగర్ లో జరుగుతున్న LCDC మరియు ఫ్రైడే - డ్రైడే కార్యక్రమాలను తిరుపతి డిప్యూటీ డిఎమ్ హెచ్వో డాక్టర్ సుధారాణి గారు పరిశీలించారు.జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా లెప్రసీపై అవగాహన మరియు నిర్ధారణ కార్యక్రమాలు జూన్ 26తేదీ నుంచి జులై16వ తేదీ వరకు జరుగుతున్నాయని తెలిపారు.కుష్ఠువ్యాధి ఏశాపం వలనో,పాపం వలనో రాదని, దానికి మైక్రో బాక్టీరియంలెప్రె అనే సూక్ష్మజీవి కారణమని, దగ్గులు,తుమ్మల ద్వారా ఇది వ్యాపిస్తుందని,ఈ వ్యాధి శరీరంలో బయట పడటానికి 5 నుంచి 7 సం౹౹ల వరకు పట్టవచ్చని,శరీరంపై స్పర్శ లేని మచ్చలుగాని,పొడలు గాని,రాగిరంగు మచ్చలు గాని,లావుగా మారిన, నొప్పితో కూడిన నరాలుగాని, కాళ్ళు లేదా చేతులలోగల కండరాల బలహీనత, తిమ్మిర్లు,నొప్పి తెలియని పుండ్లు,కళ్ళు పూర్తిగా మూసుకోలేక పోవడం, ముక్కు,చెవి తమ్మెలు మందంగామారి వుండడం, శరీరంపైగానీ,చెవితమ్మెలపై గానీ బుడిపెలు ఉండటం,కాలి పాదాలకు ఎండవేడిగానీ, పదునైన వస్తువులవలన కలిగే గాయాలుగానీ తెలియక పోవడం,నూనె రాసినట్లు నిగ నిగలాడే చర్మం వుండడం, పెన్ను లాంటి వస్తువులను పట్టుకోలేక(గ్రిప్)పోవడం వంటి లక్షణాలు ఏవి వున్నా... అవగాహన కల్పించి ఎవరికి వారే స్వయంగా వ్యక్తిగతంగ తెలుసుకునేలా ప్రజలకు ఆశా కార్యకర్తలు,ఎఎన్ఎంలు ప్రతి ఇంటికి తిరిగి తెలియజేస్తూ కుష్ఠు వ్యాధి నిర్ధారణకై పరీక్షించడం,వారినే స్వీయ పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని డాక్టర్ సుధారాణి తెలిపారు

కుష్ఠు వ్యాధిని గుర్తించడానికి శులభ సాధ్యమైన పై లక్షణాలకై ఎవరికివారు స్వీయపరీక్షలు చేసుకోవడం ఉత్తమమని డాక్టర్ సుధారాణి గారు తెలియజేశారు.వీటిలో ఏలక్షణం వున్నట్టుగ అనుమానం కల్గినా అలాంటి వారు ఆశా కార్యకర్త, ఎఎన్ఎం,యంఎల్ హెచ్పీలకు తెలిపి ఆలస్యం జరగకుండా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఉచితంగా మందులు, వైద్యసాయం పొందాలని, ప్రభుత్వం ఖరీదైన మందులను కుష్ఠువ్యాధి నిర్మూలనకై ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ఈకార్యక్రమంలో MPHEO రామకృష్ణ, సూపర్వైజర్ కామరాజు, ఎఎన్ఎం జయలక్ష్మి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: