Famous TV - ఆరోగ్యము / : ఎస్ వి ఆర్ ఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రెగ్యులర్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు నియామకం పొందినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఏ. పి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఏ.గిరిబాబు, వీర కిరణ్, జే ఏ సి నాయకులు ఎస్. సురేష్ బాబు, బాలాజీ, కిరణ్, మరియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుయా ఆస్పత్రి అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకార అందిస్తామని ఈ సందర్భంగా రుయా సూపరిటెండెంట్ కు విన్నవించారు. ఎమర్జెన్సీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ మెరుగుపరచడానికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. సూపరిటెండెంట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అందరము కలిసి ముందడుగు వేద్దామని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాత్ర ఎంతైనా అవసరమన్నారు. అప్పుడే పేద వాడికి మెరుగైన వైద్యం అందుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV