Monday, 27 July 2026 07:58:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

షీ దివ్య యోగ విద్యాలయం ఆధ్వర్యంలో వేడుకలు

Date : 21 June 2023 01:53 PM Views : 396

Famous TV - ఆరోగ్యము / అన్నమయ్య ( రాయచోటి ) : ఘనంగా పీలేరులో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు స్థానిక షీ దివ్య యోగ విద్యాలయం లో 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఘనంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు డాక్టర్ పి వి ఎస్ లక్ష్మి షీ సంస్థ న్యాయ సలహాదారులు డాక్టర్ రాయల సుధాకర్ రాయలు పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమ విజయవంతానికి పీలేరు పంచాయతీ సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ భాషా గారు తన వంతు సహాయ సహకారాల్ని అందించారని తెలియజేశారు.ఇంటర్నేషనల్ న్యాచురోపతి ఆర్గనైజేషన్ INO ఆయుష్ శాఖ వాసవి క్లబ్, మెగా వాసవి క్లబ్,వి.ఎస్.ఎన్ విద్యాసంస్థలు భువన విద్యాలయ ఏవిఆర్ స్కూల్ సాధన స్కూల్ ల యొక్క యాజమాన్యాలు మరియు విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది కార్యక్రమంలో భాగంగా యోగ డే ప్రోటోకాల్ ను అందరితో చేయించడం జరిగినది పట్టణ ప్రముఖ వైద్యులైన డాక్టర్ మమతా లక్ష్మీ శ్రీనివాస్ గుప్తా హాస్పిటల్ నుంచి, విజయలక్ష్మి శేషగిరి బాబు విజయ హాస్పిటల్ నుంచి, గ్యారంపల్లి ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ నుండి డాక్టర్ శశిరేఖ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోకాటి ఉదయ్ కిరణ్ విద్యాసంస్థల అధినేత్రులు విఎస్ఎన్ మాధవి మేడం సాధన వినుత ఏ వి ఆర్ శోభ ప్రకాష్ లో పాల్గొ నారు రాజకీయ రంగం నుండి జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిత ఆనంద్ మరియు వైస్ ఎంపీపీ పీలేరు మండలం నెల్లూరు వెంకటాచలపతి పాల్గొన్నారు.

చిన్మయ మిషన్ మేడం వారి పల్లి నుండి కృష్ణానంద స్వామి అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా భగవద్గీతలో ఉన్నటువంటి యోగాంశాలను గురించి కర్మ సిద్ధాంతాన్ని యోగ ద్వారా అందరూ పాటించాలని తెలియజేశారు డాక్టర్లు మాట్లాడుతూ యోగము కూడా ఈరోజు వైద్య విధానంలో భాగంగా ఉన్నదని యోగా ద్వారా అనేక రకాల జబ్బులకు ఈరోజు పరిష్కారం దొరుకుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ రోజు యోగ సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు విద్యాసంస్థలఅధినేత్రులు మాట్లాడుతూ ఈరోజు అన్ని పాఠశాలల్లో శ్రీ దివ్య యోగ విద్యాలయం వారి ద్వారా యోగ విద్యను అందుకుంటున్న అందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు వాసవి క్లబ్ గ్రేటర్ వాసవి క్లబ్ ద్వారా అరవిందు వారి బృందం పాల్గొని యోగ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మే నెలలో జరిగిన సమ్మర్ క్యాంపు లో పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు ఫోర్డ్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి అందజేసినటువంటి యోగా సర్టిఫికెట్లను ప్రధానం చేయడం జరిగినది నిర్వాహకులు లక్ష్మీ సుధాకర్ మాట్లాడుతూ తమ యోగా సెంటర్ ద్వారా మేలైన ఇంత ఎక్కువ మందికి యోగ విద్యను అందించి అందరినీ ఆరోగ్యవంతులుగా చేసే విధానంలో యోగ ఇన్స్పెక్టర్ కోర్స్ ను కూడా ప్రారంభించామని అవసరమైన వారు సంప్రదించవలసిందిగా కోరారని తెలియజేశారు. గత 22 సంవత్సరాలుగా యోగ సంఘంలో విశిష్ట సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందజేస్తున్నటువంటి రాయల దంపతులకు పుర ప్రముఖులు ఘనంగా సన్మానం చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: