Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎస్ వి వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల భవనము నందు సంతాన సాఫల్యత లో కృత్రిమ మేదస్సు పాత్ర పై చర్చ మరియు సంతాన సాఫల్యత అల్ట్రాసౌండ్ యొక్క వినియోగం గురించి చర్చ సమావేశము . ఈ వర్క్ షాప్ ను ప్రారంభించిన ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. ముఖ్యఅతిథిగా చెన్నై నుంచి వచ్చిన ఎస్సార్.ఎం.సి.మెడికల్ కాలేజ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ సంజీవరెడ్డి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సంతాన సాఫల్యత లో కృత్రిమ మేధస్సు అనే అంశం మీద చర్చ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క మెలకువలు పీజీ వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని రాబోవు రోజుల్లో ఇంటిలిజెంట్ ఆర్టిఫిషియల్ అనే టెక్నాలజీని ఉపయోగించుకుని వైద్యంలో పెను మార్పులను చూడవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అదేవిధంగా సంతాన సాఫల్యత అల్ట్రాసౌండ్ యొక్క వినియోగము ఉపయోగించు పద్ధతుల గురించి కూడా క్లుప్తంగా వివరించారు. ఇలాంటి వర్క్ షాప్ వల్ల మా పీజీ వైద్య విద్యార్థులకు, మీ యొక్క అనుభవాలు మెలకువలు తెలుసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఎంతో దోహదపడుతుందని డాక్టర్ పార్థసార రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు . ఈ కార్యక్రమానికి ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ప్రసూతి విభాగ వైద్యులు, మరియు పీజీ వైద్య విద్యార్థులు, పూర్వ వైద్యులు ఎస్వీ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సుబ్రహ్మణ్యం, రుయా ఆసుపత్రి పూర్వ సూపరిటెండెంట్ డాక్టర్ భారతి, అంకుర ఆసుపత్రి డాక్టర్ జి లతా, ప్రసూతి వైద్యశాల విభాగాధిపతి డాక్టర్ ప్రమీల దేవి, సెక్రటరీ ఉమాదేవి, వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV