Sunday, 26 July 2026 03:28:02 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మీడియా కన్నా సొషియల్ మీడియా మిన్న రుజువు చేస్తున్న బర్రేలక్క

దళిత బిడ్డ దెబ్బకు దడ దడలాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు కొల్లాపూర్ ను కొల్లగొట్టేది బర్రెలక్కేనా..?

Date : 23 November 2023 03:29 PM Views : 589

Famous TV - తెలంగాణ / : రాజ్యాంగం ఇచ్చి న హక్కుతో దేశ రాజకీయాలను తిరగ రాస్తున్న దళిత బిడ్డ, నామినేషన్ వేసేందుకే ఆర్థిక స్తోమత లేని ఆడబిడ్డ మీడియా కంటే సోషల్ మీడియా దెబ్బతో ఒకసారిగా దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారంటే సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉన్నదో అవగతమవుతోంది.జీరో బడ్జెట్ రాజకీయాలతో నిరుపేదలను రాజులు చేసిన,చేస్తున్న బి ఎస్ పి కూడా మీడియాను నమ్మకుండా సోషల్ మీడియాపై ఆధారపడ్డాదంటే సోషల్ మీడియా యొక్క అవసరం ప్రజలకు,రాజకీయ పార్టీలకు ఎంతైనా ఉందని అర్థమవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గంలో హేమా హేమీలైన రాజకీయ నాయకులను ఢీకొంటున్న బర్రెలక్క అలియాస్ శిరీష అనే నిరుద్యోగ దళిత బిడ్డ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని తెలుగువారి గుండెలను టచ్ చేసిందంటే సోషల్ మీడియా ప్రభావం అని చెప్పాల్సింది. బర్రెలక్క కు వస్తూ వున్న ప్రజాదరణ,రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు చూసి ఓర్వలేక ఆమెపై ఆమె కుటుంబ సభ్యులుపై జరుగుతున్న దాడులు, ఆమె చేస్తున్న ప్రచారం, ఆమె వెల్లడించిన మేనిఫెస్టో అధికార బిజెపి, టిఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుండెల్లో రైల్లో పరుగులు తీయి స్తోందంటే అది సాక్షాత్తు సోషల్ మీడియా ప్రభావం మన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గంలో ఆమె గెలుస్తుందో..? లేదో..? కానీ ఆమెకు సొషీయల్ మీడియా పుణ్యమాని నిరుద్యోగులు,మహిళలు, డాక్టర్లు,ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,న్యాయ వాదులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు.ఎందరో గుండెలను కదిలించి బర్రేలక్క మద్దతు కూడగట్టడంలో ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దృశ్యాలే ఆమెను అందలమెక్కిస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం బర్రెలకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని, ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ప్రచారం చేయడం కోసం నిరుద్యోగ యువతీ యువకులు, రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నిరుపేద దళిత బిడ్డకు అండగా నిలవడం చూస్తుంటే కచ్చితంగా కొల్లాపూర్ లో విజిల్ తో ఈల వేసి గెలిసేది బర్రెలకే అని స్పష్టమవుతుంది. మరి కొల్లాపూర్ లో స్వతంత్ర అభర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క విజయం సాధిస్తుందో ..? లేదో ..? తెలియాలంటే డిసెంబర్ 9 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.ఏదేమైనా బర్రేలక్క దైర్యం,సాహసం,రాజకీయ రంగంలోకి ఆమె ప్రవేశించిన తీరు దేశ వ్యాప్తంగా వున్న కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఆదర్శమే శిరీషా అలియాస్ బర్రెలక్కా.గుడ్ లక్ బర్రెలక్కా..!

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: