Famous TV - తెలంగాణ / : జులై 12, 2023 చౌటకూర్: ప్రజా సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బాధ్యతగా అమలు చేయని పాలకులు సంక్షేమ పథకాల పేరుతో సబ్బండ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని బహుజన్ జన సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం అన్నారు. చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యువకులు, గ్రామ ప్రజలు నేడు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం సమక్షంలో భారీగా చేరిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గ్రామ మహిళలు, యువకులు, గ్రామ పెద్ద మనుషులు వివిధ అంశాలపై మాట్లాడారు. అనంతరం ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ ఈ దేశ ప్రజల బతుకులు మార్చడం కోసం ఆనాడే అంబేద్కర్ గారు ప్రజల హక్కులను రాజ్యాంగబద్ధంగా చట్టం చేస్తే, పాలకులు రాజ్యాంగాన్ని అమలు చెయ్యకుండా, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి, రాష్ట్ర, దేశ సంపదనంతా సంపన్న వర్గాలకు పంచుతూ పేదలను మోసం చేస్తు, దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తును కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మారుస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితేనే అందరి బతుకులు మారుతయని అన్నారు. ఈ సభలో ముప్పారంప్రకాశం బి.ఎస్.పి. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభా నంతరం గ్రామంలో వీధి వీధిన ర్యాలీ నిర్వహించి, గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముగించినరు. ఈ సభ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. నాయకులు ప్రభు, బెంజిమెన్, నాగరాజ్, లక్ష్మణ్, నరేష్, మహేందర్, రాకేష్, బాల్రాజ్, ఉదయ్, వెంకటేశం, పల్లె కిరణ్ కుమార్, శ్రీనివాస్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV