Famous TV - తెలంగాణ / : చత్రపతి శివాజీ మహారాజు ముని మనవడు అయినటువంటి చత్రపతి సాహు మహారాజ్ 149వ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అందోల్ నియోజకవర్గ కేంద్రంలోని జోగిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కరణం నాయిని ఈశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ దేశంలో బహుజన కులాలకు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనుడు సాహు మహారాజ్ గారిని కొనియాడుతూ, పాలన అధ్యక్షుడు కి ఉండవలసిన దృక్పథాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాహూ మహారాజును చూసి నేర్చుకోవాలి అన్నారు. పాలకులంటే ప్రజా సంక్షేమమే జీవిత ఆశయంగా బతకడం కేవలం అది సాహు మహారాజుకు మాత్రమే చెల్లిందని, ఇలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం ఈ దేశంలో కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని రాబోయే బహుజన రాజ్యంలో మహనీయుల ఆశయాలను ఆచరణలు పెట్టడమే మా పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు నటరాజ్, జిల్లా కోశాధికారి జనార్ధన్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ లు డా.ముప్పారం ప్రకాశం, ఎండి.చాంద్ పాషా, అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, నాయకులు పద్మారావు, ప్రేమ్, కిషన్, ప్రశంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV