Famous TV - క్రీడలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని లోని విజయవాణి స్కూల్ ఆవరణలో శనివారం యోగ దినోత్సవ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అధ్యక్షతన విద్యార్థులకు యోగ ఆసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాణి పాఠశాలల కరస్పాండెంట్ నాయుని చంద్రశేఖర్ మూర్తి,మండలం పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి,తాహాశిల్దార్ పార్వతి,మండలం విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి, పాల్గొన్నారు.ఈ సందర్బంగా విజయవాణి పాఠశాలలో కరస్పాండెంట్ చంద్రశేఖర్ మూర్తి మాట్లాడుతూ మానసిక, శారీరక దృఢత్వం కలిగి ఉండాలంటే యోగ దిన చర్యలో ఒక భాగం కావాలని, విద్యార్థి దశలో ఏకాగ్రత పై పట్టు ఉండాలంటే నిత్యం యోగ అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో విద్యార్థిని , విద్యార్థులు,ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV