Famous TV - వ్యాపారం / ఎన్టీఆర్ ( విజయవాడ ) : విజయవాడ హయత్ హోటల్ లో జరిగిన జేసిఐ ఇండియా జోన్ 26 జ్ కామ్ బిజినెస్ కాంక్లేవ్ లో తిరుపతి జ్ కామ్ 2.౦ కి అత్యుత్తమ చాప్టర్ అవార్డు వచ్చినట్టు ఛైర్పర్సన్ డా|| సైఎద్ సుమయ్య తెలిపారు. 2024 సంవత్సరంలో తాము తిరుపతిలో యువ వ్యాపారవేతలని ప్రోత్సహించే విధంగా చేపట్టిన కార్యక్రమాలని గుర్తిస్తూ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆఫీసర్స్ కి, ఉత్సాహవంతమైన సభ్యులకి వివిధ విభాగాలలో అవార్డులు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ మోహన్ గారు వచ్చేసారు. రాష్ట్ర నలుమూలలనుంచి దాదాపు 150 యువ వ్యాపారవేతులు పాల్గొన్నారు.
Reporter
Famous TV